Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

ఈ నెల 12 వ తేదీన జే ఆర్ సిల్క్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా కి పిలుపు..


ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ.
విశాలాంధ్ర ధర్మవరం: పవర్లూమ్స్ కి వ్యతిరేకంగా స్థానిక నేతన్న విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, చేనేత సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెన్నంపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు చట్టా రవి, పట్టణ కార్యదర్శి రవికుమార్ ఏఐటీయూసీ నాయకులు రమణ మాట్లాడుతూ ధర్మవరం అంటే చేనేత పరిశ్రమ కి పెట్టింది పేరు అని, అలాంటి చేనేత పరిశ్రమ నేడు తీవ్ర సంక్షేమంలోకి కూరుకుపోయింది అని అన్నారు. ఈ చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోవడానికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వంలో పాలకులు పవర్ లూమ్స్ మగ్గాలను విచ్చలవిడిగా ప్రోత్సహించి చేనేత కార్మికుల ఉపాధిపై దెబ్బ కొట్టారు అని తెలిపారు. 11 రకాల రిజర్వేషన్ చట్టం అమలులో ఉన్న వాటిని తుంగలో తొక్కి,, విచ్చలవిడిగా చేనేత రకాలను మరమగ్గాలలో చేనేత రకాలను నేసి, చేనేత కార్మికుల ఉపాధి మీద తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. వీటిని అరికట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి ధర్మవరం వచ్చి ఒకటి రెండు మగ్గాలపై కేసులు నమోదు చేస్తున్నారు తప్ప వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని మండిపడ్డారు. వీటిని అలుసుగా తీసుకొని కొంతమంది బడా బాబులు ధర్మవరంలో జెర్ సిల్క్ ఫ్యాక్టరీ పేరుతో పవర్ లూమ్స్ ఫ్యాక్టరి ఏర్పాటుచేసి, చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, చట్ట విరుద్ధంగా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనాలకు కార్మికులను పిలిపించి, వారికి ఉపాధి కల్పించడమే కాకుండా చట్ట విరుద్ధంగా వైలేషన్ చేస్తున్న కూడా అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జేర్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేశామని, అక్కడ ఎలాంటి వైలేషన్ జరగలేదని పై అధికారులకు నివేదిక ఇవ్వడం చూస్తుంటే లోలోపల ఫ్యాక్టరీ యజమాన్యం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కుమ్మక్క అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.. అలాగే కొంతమంది బడా బాబులు కూడా ఇలాంటి ఫ్యాక్టరీలు మూడో నాలుగో ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇలాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు అయితే ధర్మవరంలో చేనేత పరిశ్రమ పూర్తి కనుమరుగవుతుందని అన్నారు.. చేనేత మంత్రి సవితమ్మ చేనేత మంత్రిగా బాధ్యతలు తీసుకొని, మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు ధర్మవరంలో పర్యటించలేదు అని తెలిపారు. మరో మంత్రి సత్య కుమార్ ఎలక్షన్ ముందు ధర్మవరంలో పవర్ లూమ్స్ మగ్గాలను కట్టడి చేసి, చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికైనా చేనేత మంత్రి సబితమ్మ, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ధర్మవరంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు..ఇకనుండి చేనేత కార్మికులు ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురైతే వారి పాపం ఎన్ఫోర్స్మెంట్ అధికారులుదే అని అన్నారు.అలాగే ఈనెల 12వ తేదీన నాగలూరు వద్దగల జేఆర్ సిల్క్ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న చేనేత కార్మికులు ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో చేనేత సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ బాబు, శ్రీధర్, శ్రీనివాసులు, ఓబులేసు, బాల రంగయ్య, సురేష్, చేనేత కార్మికులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img