Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రక్రియను మూడు రోజులపాటు ఎన్నికల విధులలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం జరిగిందని ఈ ప్రక్రియ సజావుగా కొనసాగించడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చివరి రోజు గురువారం పట్టణంలోని సంజయ్ నగర్ లో బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు ముగింపు ప్రక్రియ జరిగిందన్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరకు పోలీసుల పహారా మధ్య సజావుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. ఇందులో ధర్మవరం నియోజకవర్గం విధులలో ఉన్నవారు 81 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు. . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఉప ఎన్నికల తాసిల్దార్ షణ్ముఖ యాదవ్, ఎన్నికల అధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా ఇంటి వద్దకే ఓట్ల నమోదు ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగిందని, ధర్మవరం నియోజకవర్గంలో 132 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 124 మంది ఓట్లను సద్వినియోగం చేసుకున్నారని, మృతులు 6 మంది, ఆబ్సెంట్లు 2 ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img