Monday, May 20, 2024
Monday, May 20, 2024

గర్భవతులు ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు పొందాలి.. డాక్టర్ దిలీప్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం:: గర్భవతులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలో/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య చికిత్సలు పొందాలని డాక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం వారు దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీఎం ఎస్ఎంఏ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు వివిధ పరీక్షలను వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ హెచ్పి, బిపి, షుగర్, వీడిఆర్ఎల్, హెచ్పిఎస్, ఎజి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు పోషణ గురించి కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అవధూత మాదన్న ట్రస్ట్ వారిచే ఉచిత బోధన సౌకర్యమును వారు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ దిలీప్ కుమార్ అవధూత మాదన్న ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు రాజశేఖర్ రెడ్డి, జై తున్బి, ఎమ్మెల్యే హెచ్ పి జ్యోతి, జై దుర్గ, పుష్ప, చరణ్య, అనిత, ఏఎన్ఎంలు నీరజాక్షి, శ్యామల, రేణుక, సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img