విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురం జిల్లాలోని సాయిబాబా ఆలయంలో ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం గురువు మానస వారి శిష్య బృందం గురు పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రదర్శన 20 మంది చిన్నారులచే నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన కళాకారులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని ఆలయ కమిటీ వారు తెలిపారు. అంతేకాకుండా అతి చిన్న వయసులో మానస ఇటువంటి నృత్య కలను ఎన్నుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమని వారు తెలిపారు. అనంతరం నృత్యం ప్రదర్శించిన వారందరినీ కూడా ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను పంపిణీ చేశారు. తదుపరి గురువు మానస ఆలయ కమిటీ వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.