Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీఐఐసీ కార్యాలయం ఎదుట రైతులు నిరసన

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని కియా దగ్గర ఉన్న ఏపీఐఐసీ కార్యాలయం వద్ద సోమవారం రైతులు తమ నిరసనను తెలియజేశారు,నాసన్ , బెల్ భూ నిర్వాసితులకు హైకోర్టు ఉత్తర్వులు , సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ 2019 సంవత్సరపు జీవో నెంబర్. 350 ప్రకారం భూముల కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న అధ్యక్షతన ఏపీఐఐసీ కార్యాలయం వద్ద వంటా వార్పు తో నిరసన ధర్నా చేయడం జరిగింది. ఏ ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకాయల శివ నాగరాణి మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ పాల్గొనీ బాధితుల పట్ల వారు మాట్లాడుతూ సోమందేపల్లి మండలము చిన్న బాబయ్య పల్లి , గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామాల నిరుపేద దళిత చిన్న , సన్న కారు రైతు కుటుంబాల వారు నాసన్ , బెల్ సంస్థల కోసం భూములు ఇచ్చి సహకరించి అభివృద్ధికి తోడ్పాటు అందించారు. వీరిని గుర్తించే ప్రతి కుటుంబానికి ఉపాధి భద్రత కల్పించే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రావాల్సిన అన్ని హక్కులు కల్పించాల్సిన ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గం. నిర్వాసితులో కోర్టును ఆశ్రయించి హక్కుల సాధించుకున్నప్పటికీ పునరావాసం చెల్లింపులకు అధికారులకు చేతులు రాకపోవడం చూస్తుంటే పేదల పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమవుతుందని విమర్శించారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి పునరావాసం చెల్లించి ఉపాధి భద్రత కల్పించకపోతే రాబోవు కాలంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు . అనంతరం పెద్దన్న మాట్లాడుతూ భూములు ఇచ్చిన పేదలకు పూర్తిస్థాయి పునరావాసం ఇచ్చేంతవరకు పోరాడుతామని అందుకోసం ఈనెల 29వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శూవనా సోనీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ , నారాయణ , తిప్పన్న మరియు వెంకట లక్ష్మమ్మ అచ్చమ్మ వెంకట్రాముడు రమీజా , కదిరప్ప,గంగమ్మ , ఆంజనేయులు ,వెంకటరామిరెడ్డి , నారాయణప్ప మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img