Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ప్రారంభమైన ఉచిత బాస్కెట్‌బాల్ వేసవి శిక్షణ శిబిరం… శెట్టిపి జయ చంద్రారెడ్డి

విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత  బాస్కెట్‌బాల్ వేసవి శిక్షణ శిబిరాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాన్ని బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ సెట్టిపిజయ చంద్రారెడ్డి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హి దాయత్తుల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, ఈ ఉచిత శిబిరం సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని వారు తెలియజేశారు. ఈ శిబిరం ఉదయం 6 నుంచి 8 వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల నుండి ఆరు గంటల 30 నిమిషాల వరకు రెండు పూటలా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ సంజయ్, సీనియర్ క్రీడాకారులు, శిబిరమునకు హాజరైన బాస్కెట్‌బాల్, బాలికలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img