Friday, May 31, 2024
Friday, May 31, 2024

డిగ్రీ ఫలితాల్లో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయకేతనం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు లో గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు మొదటి తృతీయ ఐదవ సెమిస్టర్ ఫలితాలలో అసమాన ప్రతిభ కనబరిచి విజయకేతనం కైవసం చేసుకున్నారని కళాశాల చైర్మన్ చిన్నపరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఎస్సీ కంప్యూటర్స్ నందు జోష్ణవి 96 శాతంతో పట్టణ ప్రథమ స్థానం కైవసం చేసుకుందని తెలిపారు. అదేవిధంగా యమున, సౌమ్య 94 శాతం, కావ్య 92 శాతం, చందన, సాయి కీర్తన 90 శాతం, పాటని గ్రూపులో మాధవి 91 శాతం, సౌజియ భాను, ఫరీదా భాను 85 శాతము, చంద్రకళ, కాసిం పీరా, గౌరీ ప్రియ 82 శాతము, బీకాం గ్రూపులో వంశీ 90 శాతం, చందు మణి 80 శాతము, బి బి ఏ గ్రూపులో నారాయణస్వామి 80 శాతము లతో మార్కులను సాధించడం జరిగిందని తెలిపారు. అనంతరం చైర్మన్ చిన్నప్ప రెడ్డితోపాటు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ప్రతిబకరపరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img