London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం కరపత్రాలు విడుదల… రోటరీ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో ఈనెల తొమ్మిదవ తేదీ ఆదివారం ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహణ యొక్క కరపత్రాలను రోటరీ క్లబ్ కమిటీ వారు విడుదల చేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ పి. కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు, ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడమే మా రోటరీ క్లబ్ లక్ష్యము అని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు మామిళ్ళ వెంకటరమణమ్మ జ్ఞాపకార్థం, మామిళ్ళ రంగనాయకులు వారి కుటుంబ సభ్యులు-శ్రీ చౌడేశ్వరి దేవి సిల్క్స్ ధర్మవరం వారు వ్యవహరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ శిబిరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకరా కంటి ఆసుపత్రి -, జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కంటి వైద్య చికిత్సలు తదుపరి ఆపరేషన్కు ఎంపికైన వారిని స్వయంగా రోటరీ క్లబ్ వారే బెంగళూరుకు తీసుకొని వెళ్లి అక్కడ కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఆపరేషన్ల కొరకు వెళ్లిన వారికి బెంగళూరులో ఉచిత భోజనము వసతి వాహన సౌకర్యం కూడా కల్పించబడునని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చేవారు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా గుర్తింపు ఓటర్ కార్డులలో ఏదేని రెండు జిరాక్స్ కాపీలు మూడు ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చు వారు ఈ హెచ్ ఎస్ కార్డు గాని ఆరోగ్యశ్రీ కార్డు గాని మిగిలిన ఏ కార్డు కూడా తీసుకొని రావలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా బీపీ షుగర్ ఎక్కువ ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తగ్గించుకొని రావాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి,అందత్వాన్ని నివారించి, రెండు జీవితాలలో వెలుగులు నింపాలని కూడా కోరారు. అదేవిధంగా రోటరీ క్లబ్ వారి గాంధీ పార్కులో గల ఫ్రీజర్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడమైనదని, వాటిని కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోలిగాళ్ళ వెంకటేశులు సత్రశాల ప్రసన్న కుమార్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ రత్నశేఖర్ రెడ్డి, మనోహర్ గుప్తా, కొండయ్య, రామకృష్ణ, కృష్ణమూర్తి, పెరుమాళ్ళ దాస్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img