London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ఘనంగా జరిగిన అవతార్ మెహర్ బాబా జన్మదిన మహోత్సవ వేడుకలు…

కార్యదర్శి సుజాత
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పెనుజూరు కాలనీ శివానగర్ లో గల అవతార్ మెహర్ బాబా ధర్మవరం సెంటర్లో మెహర్ బాబా 130వ జన్మదిన వేడుకలు మెహర్ బాబా సెంటర్ కార్యదర్శి పెనుజూరు రమేష్ సుజాత ఆధ్వర్యంలో బాబా ప్రేమికుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలు ఉదయం నాలుగున్నర నుండి మధ్యాహ్నం వరకు వివిధ కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత 14 మంది చిన్నారుల చేత మెహర్ బాబా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత పతాక ఆవిష్కరణను రమేష్ సుజాత ఆవిష్కరించారు. అనంతరం కార్యదర్శి సుజాత తో పాటు ఉపన్యాసకులు అంబటి సతీష్ మాట్లాడుతూ ప్రతి మానవుడు సేవా భావాన్ని అలవర్చుకోవాలని, తోటి వారిని ప్రేమించి కష్టాల సమయంలో ఆదుకోవాలని తెలిపారు. అదేవిధంగా మెహర్ బాబా తెలిపిన ప్రకారం అసత్యపు ఆత్మల మరణ దినమునకు మీ నిజమైన ఆత్మలు నాలో జన్మించుటకు నేను మిమ్మల్ని ఆశీర్వదించుచున్నానని తెలిపారు. భగవంతుని కోరుకోవటము లేక మీ ఆత్మలను కోరుకోవటం మీ మీదనే ఆధారపడి ఉన్నదని తెలిపారు. వికసించుటమో, వాడిపోవటమో ఎవరి ఇష్టము వారిది అని, ఎన్నుకొనుట అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందని తెలిపారు. అనంతరం గేమ్స్, మ్యూజికల్ చైర్స్, క్విజ్ నిర్వహించారు. విజేతలకు బాబా ప్రేమికుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని మూడు హాస్టల్లో బాల బాలికలకు అందరికీ లడ్డు, పెన్ను, బాబా ఫోటో, నోర్సులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. బాబా ప్రేమికులచే భజన సంకీర్తన పాటలను నిర్వహణ అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా జన్మదిన వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరమును కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహన జరిగింది. ఈ శిబిరంలో 105 మందికి వైద్యుల చేత వైద్య చికిత్సలు అందించి, ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మోహన్ దాస్, శశిధర్, గిర్రాజు అరవింద్, సురేష్, జయప్రకాష్, అన్నం రమేష్, డీకే. మనోహర్ లతోపాటు వందల సంఖ్యలో బాబా ప్రేమికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img