.విశాలాంధ్ర ధర్మవరం:: పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కవులు రచయితల సభను నిర్వహించారు. ఈ సభలో ధర్మవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ జయ సింహ తన కవిత్వాన్ని ప్రతిభ చాటడంతో, కవుల సభ అతనిని ఘనంగా సన్మానించారు. జయసింహ రాయలపై చేస్తున్న కవిత వసంతోత్సవ కవనం అందరిని ఆకట్టుకుంది. అనంతరం కవులందరూ జయసింహను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.