Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే నా ప్రథమ కర్తవ్యం..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం::నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే నా ప్రధమ కర్తవ్యం అని, ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క సహాయ సహకారాలు మరువలేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోతుకుంట రోడ్డు దుర్గా నగర్ లో గల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పూజలు నిర్వహించి, తదుపరి ఆసుపత్రి గదలను వారు ప్రారంభించారు. తొలుత పూజలు నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ గిరిజ, జిల్లా కోఆర్డినేటర్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అనంతపురం-పాల్ రవికుమార్, జిల్లా కోఆర్డినేటర్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ శ్రీ సత్యసాయి జిల్లా- తిపేంద్ర నాయక్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రభుత్వము చేపట్టని అభివృద్ధి పనులను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టడం గర్వించదగ్గ విషయమని కోట్ల వ్యయముతో నాడు ఈ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడం ధర్మవరం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఒక వరం లాగా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా , వైద్య, వసతి తదితర అంశాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేయడం శుభపరిణామం అని తెలిపారు. గుడ్ మార్నింగ్ పేరిటన తాను ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అధికారుల ద్వారా, ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తుంటే కొంతమంది ప్రతిపక్షాలు,కొన్ని దినపత్రికలు నాపైన బురద చల్లడం సరి అయిన పద్ధతి కాదని తెలిపారు. తాను కబ్జాలు దండాలు చేస్తున్నట్లు సరియైన ఆధారాలు చూపించినప్పుడే తాను సమాధానము ఇవ్వగలరని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేకనే కొన్ని రాజకీయ పార్టీలు అనవసరమైన ఆరోపణలు విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి నియోజకవర్గంలోని సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే రాజకీయాలకు అతీతంగా తనవంతుగా తాను సమస్యలు పరిష్కరించే దిశలో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి,, భర్త కాచర్ల అంజి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు వేములవాడ జయరాం రెడ్డి, శంషాద్ బేగం, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, కో ఆప్షన్ సభ్యులు షమీం, కరీం,రామకృష్ణ, దుర్గా నగర్ కౌన్సిలర్ భాగ్యలక్ష్మి, పట్టణ వైయస్సార్సీపీ నాయకులు, పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, వివిధ విభాగాల అధికారులు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img