Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటిపూట బడి ప్రారంభం..

మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో గల ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో ఈనెల 18వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని మండల విద్యాశాఖ అధికారిని-1 రాజేశ్వరి దేవి, మండల విద్యాశాఖ అధికారి-2 గోపాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 18వ తేదీ నుంచి పట్టణంలోని 10 పరీక్ష కేంద్రాలు గల పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుండి నాలుగు గంటల వరకు బడిని నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా మిగిలిన పాఠశాలలు ప్రాథమిక మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నిర్వహించాలని తెలిపారు. ఎటువంటి పరిస్థితులలో అదనపు తరగతులను నిర్వహించరాదని, వేసవి కాలం ఉన్నందున విద్యార్థులు వడదెబ్బకు శోకకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అదేవిధంగా పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఈ విధంగా ఉన్నాయని తెలిపారు. బి ఎస్ ఆర్ బాలుర ఉన్నత పాఠశాల, బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల, కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, ఎస్పీసీఎస్ బాలుర మున్సిపల్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, యశోద కాన్సెప్ట్ హై స్కూల్, సుందరయ్య నగర్ శ్రీ గణేష్ పురపాలక ఉన్నత పాఠశాలలో మాత్రమే పదవ తరగతి పరీక్ష కేంద్రాలు (10) ఉంటాయని వారు తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాలలో ఉన్న ప్రధాన ఆచార్యులు మిగిలిన తరగతులకు మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 4:00 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలిపారు. ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా హెచ్ఎంలు సహకరించాలని తెలిపారు. ఈ సమాచారాన్ని విద్యార్థులకు సర్కులర్ ద్వారా ప్రతి పాఠశాల హెడ్మాస్టర్ పంపిణీ చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img