విశాలాంధ్ర ధర్మవరం:: ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరములో ఫెయిల్ అయిన విద్యార్థులు గడుగులోగా పరీక్ష ఫీజన చెల్లించాలని డిఐఈఓ రఘునాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిక్ష ఫీజు కట్టుటకు ఈనెల 18వ తేదీ నుండి 24వ తేదీ లోపల కట్టవలెనని తెలిపారు. అదేవిధంగా మొదటి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ విద్యార్థులకు కూడా ఎగ్జామ్ ఫీజులు ఇదే తేదీలలో ఉంటాయని తెలిపారు. సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుండి ప్రారంభమగునని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మే ఒకటవ తేదీ నుండి ప్రారంభించబడునని తెలిపారు. కావున ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్ లు గమనించి విద్యార్థులకు తెలియపరిచి సహకరించాలని తెలిపారు.