Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

గర్భవతులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

డిపిహెచ్ఎన్ఓ- వీరమ్మ, డిపిఓ- నాగరాజు.
విశాలాంధ్ర ధర్మవరం:: గర్భవతులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిపిహెచ్ఎన్ఓ వీరమ్మ, డిపిఓ నాగరాజు, డేటా మేనేజర్ సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎంఐఎస్ వాలిడేషన్ లో భాగంగా మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పోతుకుంట ఆరోగ్య ఉప కేంద్రమును వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భవతులకు బాలింతలకు యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలకు అందుతున్న సేవలు గూర్చి వారు ఆరాధిశారు. అలాగే కొద్ది మందికి రక్త పరీక్షలు నిర్వహించి వారిలో హిమోగ్లోబిన్ శాతాన్ని క్రాస్ చెక్ చేయడం కూడా జరిగిందని తెలిపారు. ఆరోగ్య వైద్య సేవలు యొక్క వివరాలను ఆన్లైన్లో సరిగా నమోదు చేస్తున్నారా లేదా అని వారు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్, సూపర్వైజర్ జయతున్బి, ఏఎన్ఎం శ్యామల, ఎమ్మెల్యే హెచ్ పి గౌతమి, ఎంపీహెచ్ఏ ఆంజనేయులు తోపాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img