Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రామోజీ మృతి తెలుగు జాతికి తీరని లోటు

చేనేత జాతీయ సభ్యురాలు సంకారపు జయశ్రీ, రిటైర్డ్ జిల్లా ఆంధత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:; అభ్యుదయ మార్గదర్శి, ఈనాడు పత్రిక సంస్థ చైర్మన్, రామోజీ గ్రూపు సంస్థల అధినేత, పద్మ విభీషణ్ చెరుకూరి రామోజీరావు (88) మృతి తెలుగుజాతికి తీరని లోటు అని, ఓ మంచి వ్యక్తిని పత్రికారంగం సినీ రంగం కోల్పోవడం నిజంగా బాధాకరమని చేనేత జాతీయ సభ్యురాలు సంకారపు జయశ్రీ, రిటైర్డ్ కంటి అంతత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు పేర్కొన్న రు. ఈ సందర్భంగా వారు స్థానిక ఎన్జీవో హోం లో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభ పాత్రికేయులతో పాటు జయశ్రీ డాక్టర్ నరసింహులు ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత రామోజీరావు చిత్రపటానికి అందరూ పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం వహించారు. అనంతరం జయశ్రీ, డాక్టర్ నరసింహులు దంపతులు మాట్లాడుతూ రామోజీరావుతో తమకున్న పరిచయాలను చెబుతూ, మద్యపాన నిషేధములో మూడు సంవత్సరాలు పాటు వారితో పాటు పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఒక జర్నలిజం సంస్థలు స్థాపించి వేలాదిమందికి ఉపాధి కల్పించి, ఇతర వ్యాపార సంస్థలు శని పరిశ్రమ మార్గదర్శి, ఈనాడు టీవీలలో ఉపాధి కల్పించడం ఆయనకు ఆయనే సాటి అన్నారు. నీతి నిజాయితీ కలుపుకొని రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కృషిచేసి, ఎన్నో కష్టాలను ఎదురింటిన మహానుభావుడు అని తెలిపారు. నేడు ఆయన అనారోగ్యంతో మృతి చెందడం, మనందరికీ తీరని లోటు అని తెలిపా రు. వారి ఆశయ సాధనాల కోసం పాత్రికేయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రముఖ కాలమిస్ట్ సామాజిక కార్యకర్త రామోజీ ఎందరికో ఆదర్శవైనారని తెలిపారు. దేశస్థాయిలో రామోజీ ఫిలిం సిటీ అందరికీ ఆదర్శమైందని తెలిపారు. వివిధ ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా రామోజీ పట్ల వారు చేసిన కృషి పట్ల ఆనాడే మంచి గుర్తింపు రావడం జరిగిందన్నారు. జీవితములో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ లెక్కచేయకుండా, ఒక లక్ష్యంతో, పట్టుదలతో, ఉన్నత స్థానానికి చేరుకొని, తన సంస్థలను అత్యున్నత శిఖరాల్లో అగ్రగామిగా నిలబెట్టిన మహా వ్యక్తి రామోజీ రావే అని తెలిపారు. ఆయన ఆశయాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని తెలిపారు. ఈనాడు దినపత్రిక తో పాటు వివిధ ప్రాంతీయ భాషలలో ఈటీవీ, ప్రసార మాధ్యమాలు, రామోజీ గ్రూప్ సంస్థలు ప్రియా సంస్థల పేర్లతో పచ్చళ్ళు, వంటే నూనెలు, దేశములోనే అత్యంత పర్యాటక కేంద్రంగా రామోజీ ఫిలిం సిటీ వంటి వాటిని స్థాపించి, ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందడం నిజంగా అభినందనీయమని తెలిపారు. రామోజీ ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడు అని గొప్ప వ్యక్తిగా ప్రపంచ పటంలో నిలిచిపోతారని తెలిపారు. ప్రతి పాత్రికేయుడు రామోజీరావు లో గల ఆశయ సాధనాల కొరకు అకుంఠిత దీక్షితో, నీతి, నిజాయితీతో వార్తలను ప్రజలకు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img