Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి ఉంది..

లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గూడూరు మోహన్ దాస్, రాజగోపాల్
విశాలాంధ్ర -ధర్మవరం; పేద ప్రజలకు వైద్య సేవలు చేయడంలోనే ఎంతగానో సంతృప్తి సంతోషము ఉంటుందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు గూడూరు మోహన్ దాస్, కార్యదర్శి రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ వారు ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మోహన్ దాస్, రాజగోపాల్, కోశాధికారి వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపుగా 50వేల మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయించడంతోపాటు ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా చికిత్సలు చేసి, షుగర్ కంట్రోల్ గా ఉన్న వారికి కూడా ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరాలు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నేటి క్యాంపు దాతగా కీర్తిశేషులు కాచర్ల హనుమంతు జ్ఞాపకార్థం వీరి కుమారుడు కాచర్ల నాగరాజు వ్యవహరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పిట్టా వెంకటస్వామి నేతృత్వములో ఈ శిబిరాలు నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. అనంతరం క్యాంపు దాతలు క్లబ్బు వారు ఘనంగా సత్కరించారు. ఈ శిబిరంలో 85 మంది కంటి రోగులు రాగా అందులో 50 మందిని కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ శిబిర నిర్వహణకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ, ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరికీ కూడా పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేటికల కుళ్లాయప్ప, సాగా సురేష్, రాధాకృష్ణ, ఉట్టి శివప్రసాద్, కొత్తపాలెం కుమార్, చందా నాగరాజు, రమేష్ బాబు-ఫిజికల్ డైరెక్టర్, నాగేంద్ర- పిడి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img