Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఉచిత విద్య కొరకు ఆన్లైన్లో నమోదు చేసుకోండి..

మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం యొక్క ఆర్టీఈ 121 సీలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉచిత విద్య కొరకు ఆన్లైన్లో ప్రవేశాలను దరఖాస్తు చేసుకోవచ్చునని మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ ఉచిత విద్య అవకాశమును ఈ నెల నాలుగవ తేదీ నుండి ఇవ్వడం జరిగిందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సీఆర్పీల ద్వారా వారి క్లస్టర్ పరిధిలోని గ్రామ/ వార్డులలోని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. అనాధ పిల్లలకు, హెచ్ఐవి ప్రభావితులకు ఐదు శాతం సీట్లు, షెడ్యూల్ కులాల వారికి 10 శాతం, షెడ్యూల్ తెగల వారికి నాలుగు శాతం, బలహీన వర్గాలకు అండ్ మైనారిటీలకు 6 శాతము సీటు ప్రభుత్వం కేటాయించడం జరిగిందని తెలిపారు. కావున ప్రజలు పై విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img