Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

48 గంటల్లో హత్య కేసును చేదించిన రూరల్ పోలీసులు

హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్.. కోర్టుకు తరలింపు

ఆస్తి తగాదాలతోనే హత్య చేశామన్న ముద్దాయిలు
ధర్మవరం ఇంచార్జ్ డి.ఎస్.పి.. బాజీ జాన్ సైదా.
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం మండలం వెల్దుర్తి గ్రామంలోని ఆటో డ్రైవర్ తాడిమర్రి సూర్యనారాయణ హత్య కేసును రూరల్ పోలీసులు 48 గంటల్లో కేసును సాధించారు. ఈ సందర్భంగా ధర్మవరం ఇంచార్జ్ డి.ఎస్.పి (పెనుకొండ డిఎస్పి) బాజీ జాన్ సైదా ప్రెస్ మీట్ లో పలు వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ మృతుడు ధర్మారం మండలం వెల్దుర్తి గ్రామంలో అత్తగారింట్లో ఇల్లరికం ఉంటూ ఆటో డ్రైవర్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. ఫిర్యాది తల్లి సాలమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానముగా ఉన్నారని, సుమారు 23 సంవత్సరాల కిందట కూతురు కృష్ణవేణిని తాడిమర్రి కి చెందిన సూర్యనారాయణ (మృతుడు) కు వివాహం కాగా, మూడు సంవత్సరాల తర్వాత ఫిర్యాదురాలు తన భర్త సూర్యనారాయణ తల్లి సాలముతో పాటు కలిసి వెల్దుర్తి గ్రామములో కాపురం ఉంటున్నారని తెలిపారు. సాలమ్మ భర్త చనిపోగా మొత్తము ఆస్తి శాలమ్మ పేరుమీద మార్చబడినదిని, ఈ ఆస్తి గురించి చాలమ్మా చిన్న కొడుకు మల్లికార్జున కు కూతురు కృష్ణవేణి కుటుంబానికి మధ్య భూమి విషయములో తగాదాలు ఉండేవని తెలిపారు. తరచూ రెండు కుటుంబాలు గొడవ పడుతూ ఉండేవారని, సుమారు వారం రోజుల క్రితం మృతుడు సూర్యనారాయణ ఆస్తి గురించి మల్లికార్జునతో ఆస్తి జోలికి వస్తే, తనను చంపుతానని బెదిరించడం జరిగిందని తెలిపారు. అందుకు భయపడిన మల్లికార్జున ఆస్తి ఎలాగైనా దక్కించుకోవాలంటే తన బావ సూర్యనారాయణ ను (మృతుడు) చంపాలని నిర్ణయించుకొని పథకం వేశారు అని తెలిపారు. ఈ పథకం ప్రకారం మల్లికార్జున కొడుకు రాము, అల్లుడు రాజు, సమీప బంధువైన లక్ష్మీనారాయణతో కలిసి, ఈనెల 19వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు, వెల్దుర్తి క్రాస్ వద్ద కాపు కాచి, మృతుడైన సూర్యనారాయణ తన ఆటోలో అక్కడికి రాగా, అతనిని చంపాలనే ఉద్దేశంతో పై వారందరూ మాట్లాడుదామని మృతుడిని మభ్యపెట్టి తన ఆటో తోపాటు ధర్మవరం మండలం సీసీ కొత్తకోట గ్రామ శివారులలో ధర్మవరం-కొత్తచెరువు బీటీ రోడ్డు నుండి రోడ్డుకి తూర్పు వైపున ఉడతరాల డీసీ పొలం వద్దకు తీసుకొని వెళ్లి, ఇనుప రాడ్తో ఆటోలో ఉన్న మృతుడు సూర్యనారాయణ మీద దాడి చేసి, కింద పడేసి కొట్టి, చనిపోయిన తర్వాత వారందరూ పారిపోవడం జరిగిందని తెలిపారు. ఇటీవలే జిల్లా ఎస్పీ రత్నం నేర స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు. తదుపరి ఎస్పీ రత్నం ధర్మారం ఇన్చార్జ్ డిఎస్పి బాజీ జాన్ సైదా ఆధ్వర్యంలో రూరల్ సిఐ ఆరోహణరావు, రూరల్ ఎస్సై నరేంద్ర, తన సిబ్బందితో టీమును ఏర్పాటు చేసి ఈనెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి క్రాస్, ధర్మవరం-పుట్టపర్తి రోడ్డు వద్ద నలుగురు ముద్దాయిలైన మల్లికార్జున-వెల్దుర్తి గ్రామం, రాము-వెల్దుర్తి గ్రామం, రాజు-గోరంట్ల గ్రామం, ప్రెసిడెంట్ ఆఫ్ అనంతపురం మున్నా నగర్, లక్ష్మీనారాయణ-చిన్నపరెడ్డి పల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం అను ముద్దాయిలను (నలుగురు) అరెస్టు చేసి, వారి వద్ద నుండి మృతుడి సెల్ ఫోనును, హత్యకు ఉపయోగించిన రాడును, ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసును 48 గంటల్లో చేదించిన రూరల్ సీఐ ఆరోహణరావును, ఎస్సై నరేంద్రను, రూరల్ స్టేషన్ సిబ్బందిని ఇన్చార్జి డిఎస్పి అభినందించి, అవార్డు కొరకు ఎస్పీ గారికి తెలుపుతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img