Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఓట్లు అడిగే ముందు గ్రామీణ రహదారులు కనపడవా ?

విశాలాంధ్ర- చిలమత్తూర్ రూరల్ (శ్రీ సత్య సాయి జిల్లా) : మా పార్టీ గుర్తుకు ఓటు వేయండి, అది చేస్తాం ఇది చేస్తాం అంటూ అబద్ధాల మాటలు చెప్పి ఎన్నికల అయిన తర్వాత సంవత్సరాలు గడచిన ఆ పల్లెల్లో అభివృద్ధికి అడుగులేయడానికి మాత్రం గుర్తుకు రావడం లేదు. ఓట్లు అడిగే ముందు గ్రామీణ రహదారులు నాయకులకు కనబడవా, మండలంలో ప్రస్తుతం ఎస్. ముదిరెడ్డిపల్లి, కమ్మయ్య గారి పల్లి, పెద్దనపల్లి, చిన్నన్నపల్లి, తమ్మి నాయన పల్లి, తదితర గ్రామాలలో రహదారులు అభివృద్ధికి నోచుకోలేక, ప్రజలు ఇబ్బందులు పడిన సంఘటనలు లేకపోలేదు ఈ విషయంపై పలుమార్లు ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారులకు తెలియజేసినను బూడిదలో పోసిన పన్నీర్ అయింది, ప్రస్తుతం నాయకులు ఓటర్లే మా దేవుళ్ళు ప్రజలే మా కుటుంబం అని, కళ్ళు బుల్లి మాటలు చెప్పే పాలకులు పల్లెలపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేయడం పట్ల మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, గతంలో వేసిన రహదారులే అప్పటినుంచి ఇప్పటివరకు కంకరతో దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు మారు మూల గ్రామాలలో మాత్రం చేసింది ఏమిటని ఓటర్లు గుర్తు చేస్తున్నారు, రహదారుల కోసం పలుమార్లు విన్నవించిన చేసింది శూన్యమే, దీంతో ఆయా గ్రామాలలో రవాణా సౌకర్యం లేక విద్య బుద్ధులు నేర్చుకోవలసిన విద్యార్థులు విద్యకు దూరం కావలసి వస్తుంది, వైద్య సేవల కోసం వర్షా కాలంలో కనీసం 108 గ్రామాల్లోకి వచ్చేకి ఇబ్బంది పడిన సంఘటనలు లేకపోలేదు ఐదేళ్లకు ఒకసారి మీ గ్రామాలకు నేననే పాలకలను వదిలేసి అభివృద్ధి అనే ప్రశ్నతో అభ్యర్థులను హెచ్చరిస్తేనే భవిష్యత్తుకు అభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు చర్చలు జరుగుతున్నట్లు వినికిడి, వినని పాలకులను వదిలేసి ప్రశ్నతో హెచ్చరిస్తేనే భవిష్యత్తుకు అభివృద్ధి జరుగుతుందని ఓటు అడిగే ప్రతి నాయకుడికి కాగితం ఇవ్వాలని.. సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే మండలంలో రహదారులు వేయని నాయకుని వెంట వెళతారో లేక అనుకూలమైన రహదారి ప్రయాణానికి ప్రశ్నిస్తారో ఓటు వేసే ప్రజలే నిర్ణయించుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img