Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఆరవ రోజు నామినేషన్లు 9 రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం లోని నామినేషన్ కేంద్రంలో ఆరవ రోజు 9నామినేషన్లు రావడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణానికి చెందిన గట్టు చైతన్య.. ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ, ఎన్ వీరనారాయణ స్వామి.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బి ఎల్ ఓసి పార్టీ, ఎన్. ధారా శంకర్ జై భీమ్ రావు భారత్ పార్టీ, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. వైయస్సార్సీపి పార్టీ, బీరే సోమశేఖర్ .. ఇండిపెండెంట్ అభ్యర్థిగా, దాసరి కవిత..(రెండవ సెట్టు) ఇండిపెండెంట్గా, సత్య కుమార్ యాదవ్ బిజెపి పార్టీ.(జయశ్రీ, గిర్రాజు నగేష్ ప్రతిపాదనగా) రంగన్న అశ్వత్ నారాయణ.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గా నామినేషన్లు వేయడం జరిగిందని తెలిపారు. ఈ నామినేషన్ ప్రక్రియ ఈనెల 25వ తేదీ వరకు ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నిర్వహించడం జరుగుతుందన్నారు. నామినేషన్లు వేసేవారు నాలుగు సేట్లు వేయవచ్చునని తెలిపారు. అదేవిధంగా ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల అభ్యర్థులకు హెల్ప్ అండ్ డిస్క్ అనే సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, నామినేషన్ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 26న నామినేషన్ పరిశీలన, 29వ తేదీన నామినేషన్ ఉపసంహరణ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలిపారు. కావున నామినేషన్ వేసే అభ్యర్థులు పై విషయాలను గమనించి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img