Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పొలిమేర పెద్దమ్మ గుడి కి ప్రత్యేక పూజలు.. పూజారి పెద్దన్న

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మారుతీ నగర్ లో వెలసిన పొలిమేర పెద్దమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వివిధ వేడుకలను భక్తాదులు, పూజారి పెద్దన్న ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, భక్తాదుల నాట్యములతో ఈ వేడుకలు ఎంతో వైభవాన్ని చేకూర్చాయి. ఆలయంతో పాటు ఆవరణమంతా చక్కటి అలంకరణ గావించి, భక్తి భావాన్ని పెంపొందించే విధంగా పండుగ వేడుకలాగా జరిగాయి. అమ్మవారిని తమలపాకులతో, వివిధ పూలు తో కూడిన పూలమాలలు, వేపాకు మాల, నిమ్మకాయలతో చక్కటి అలంకరణ, వివిధ పంచలోహాలతో కూడిన ఆభరణములు, భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారికి దేవరతో పాటు బోనాల కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా భక్తాదులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో చందమూరి నారాయణరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, నాగన్న తదితర భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img