Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవ వేడుకలు..

అర్చకులు శ్రీధర్ శర్మ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో ఈనెల 24వ తేదీ బుధవారం ఉదయం 10 నుండి 12 గంటల లోపు శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్, అర్చకులు శ్రీధర్ శర్మ, దేవస్థాన కమిటీ, కళ్యాణ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో ఈ కళ్యాణోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ కళ్యాణోత్సవ వేడుకలు శాశ్వత నిధికి గాను దాతలు ఇచ్చిన మొత్తం బ్యాంకులో వేయగా వడ్డీతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దాతల సహకారంతో భోజన పంపిణీ కూడా ఉంటుందని తెలిపారు. కళ్యాణోత్సవములో పాల్గొనేవారు ముందుగానే ఆలయంలో తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. తదుపరి పరిసే మునయ్య భజన మండలి వారిచే అన్నమయ్య కీర్తన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. కావున భక్తాదులందరూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవ వేడుకలకు తరలిరావాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img