Friday, April 19, 2024
Friday, April 19, 2024

వేసవి సెలవులు ఈనెల 24 నుండి జూన్ 11 వరకు..

మండల విద్యాశాఖ అధికారులు.. గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి.
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తించబడిన ప్రైవేట్ పాఠశాలలకు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులుగా ఉంటాయని మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల ఐదున బాబు జగ్జీవన్ రామ్ జయంతి, తొమ్మిది న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామనవమి ప్రభుత్వ సెలవులు గా ఉంటాయని తెలిపారు. ఈనెల 13వ తేదీ రెండవ శనివారం పరీక్ష ఉంటుందని, ఈనెల ఆరవ తేదీ నుండి 19వ తేదీ వరకు ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పునః పాఠశాల ప్రారంభం జూన్ 12వ తేదీన ఉంటుందని తెలిపారు. కావున ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు ఉపాధ్యాయులు గమనించి, సమాచారాన్ని విద్యార్థులకు అందజేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img