Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఉచిత బాస్కెట్బాల్ వేసవి శిక్షణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి…

ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానము నందు మే 4వ తేదీ నుండి నెల రోజులపాటు ఉచిత బాస్కెట్బాల్ వేసవి శిక్షణ శిబిరం ను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదాయత్తుల్ల,కోచ్ సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం నాలుగున్నర గంటల నుండి 6:30 గంటల వరకు రెండు పూటలా కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ శిబిరాన్ని ఉపయోగించుకుని మంచి క్రీడాకారులుగా ఎదగాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9030944717 కు గాని 939170032 కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img