Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఉచిత గుండె వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్ పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల స్పందన హాస్పిటల్లో ఈ నెల ఐదవ తేదీ శుక్రవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ శరీరంలో గుండె అతి ముఖ్యమైన భాగము అని, గుండె పట్ల తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిఆర్బిఎస్, బి పి, ఈ సి జి, 2డి ఎకో కూడా ఉచితంగా చేయబడునని తెలిపారు. ఈ శిబిరమునకు వచ్చువారు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని తెలిపారు. గుండెనొప్పి, చాతి నొప్పి, గుండె దడ, ఆయాసము, కళ్ళు తిరగడం, గుండెలో మంట కలగడం, చాతి బరువుగా ఉండడం, నిద్రలో ఆయాసము వచ్చి లేచి కూర్చోవడం, కాళ్లు వాపు రావడం, చెమటలు పట్టడం లాంటి సమస్యలతో బాధపడే వరకు కూడా వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img