Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి.. విద్యార్థి సంఘాలు

విశాలాంధ్ర -ధర్మవరం : అక్రమంగా అడ్మిషన్లకు పాల్పడుతున్న నైరా ఎరుడైట్ స్కూలుకు వత్తాసు పలుకుతున్న మండల విద్యాశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఆర్ జె టి కి వినతి పత్రాన్ని వివిధ విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరంలో నైరా డైట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా అడ్మిషన్లకై పెద్దపెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ విషయమై ముందుగానే ఎంఈఓ లకు తెలిపిన కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని తెలిపారు. ఏమీ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎంఈఓ లపై వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలకు సంబంధించిన ఫ్లెక్సీ హోల్డింగులను ఇంతవరకు తొలగించలేకపోవడం దారు మని తెలిపారు. అందుకే కడుపులో ఉన్నటువంటి ఆర్జెడి కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img