Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా సాకే వినయ్ కుమార్ నియామకం

జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జిగా సాకే వినయ్ కుమార్ ను నియమించడం జరిగిందని శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కూలకుంట్ల నాగరాజు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాకే వినయ్ కుమార్ గృహములో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పార్టీ కోసం అందరూ కృషి చేయాలని వారు తెలిపారు. సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ పట్టణములో ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ పెద్దలను కలుపుకుంటూ ధర్మవరంలో మంచి మెజారిటీ వచ్చేలా గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు సహకరించిన జాతీయ అధ్యక్షులు మాయావతి, రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి, జిల్లా అధ్యక్షులు పార్లమెంటు ఇన్చార్జి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img