కాస్మోటిక్ దంత వైద్య నిపుణులు రాఘవేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం:: దంతాల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి అని కాస్మోటిక్ దంత వైద్య నిపుణులు జి. రాఘవేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని ఎండిఓ ఆఫీస్ పక్కన, ఎల్పీ సర్కిల్, సిద్దయ్య గుట్ట వద్ద గల శ్రీ రాఘవేంద్ర జనరల్ అండ్ డెంటల్ క్లినిక్ నందు ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత దంతా అండ్ మెగా వైద్య శిబిరము నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. తదుపరి వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా కన్ను, వృద్ధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ నరసింహులు హాజరవుతున్నట్లు తెలిపారు. జ్వరము, మలేరియా, టైఫాయిడ్, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, దంతా చిగుళ్ల సమస్యలు, వంకర పళ్ళు, అన్ని రకాల దంత సమస్యలతో పాటు సాధారణ జబ్బులకు కూడా ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బిపి అండ్ షుగర్ పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవలసిందిగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ డాక్టర్ జి. నాగార్జున, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ జి. చౌడయ్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.