Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆలయ అభివృద్ధి సంఘం చేస్తున్న కృషి అనన్యమైనవి..

తొగట వీర క్షత్రియ కుల గురువు శ్రీ దివ్య జ్ఞానానంద గిరి స్వామి, ఆర్డీవో వెంకటశివిరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం చేస్తున్న ఉచిత వైద్య చికిత్స శిబిరాలు అనన్యమైనవని, ఇటువంటి శిబిరాలు పేదలకు వరం లాగా మారడం ఒక అదృష్టం అని తొగట వీర క్షత్రియ కులగురువు శ్రీదివ్య జ్ఞానానంద గిరి స్వామి, ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, జాతీయ చేనేత మహిళ నాయకురాలు సంకారపు జయశ్రీ, రిటైర్డ్ జిల్లా అంతత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ శిబిరం 100వ శిబిరములోకి అడుగుపెట్టడంతో అత్యంత వైభవంగా ఈ శిబిర వేడుకలను క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశ్వర్లు, (చిట్టి) ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు బంధనాథం నారాయణస్వామి జ్ఞాపకార్థం వీరి ధర్మపత్ని లక్ష్మీదేవి వీరి కుమారుడు బంధనాథం వెంకటరమణ అండ్ బ్రదర్స్ వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా సిబిరములోని వచ్చిన రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను డాక్టర్ వివేక్ కుల్లయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ ఎం. సుబ్రహ్మణ్యం, డాక్టర్ డివి. జై దీపు నేత, డాక్టర్ వినయ్ కుమార్ రోగులకు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ జిల్లాలోనే ఇటువంటి శిబిరాలు ఎక్కడ లేవని, పేదలకు వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడా మందులను ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ సంతోషించదగ్గ విషయం అని తెలుపుతూ ఆలయ కమిటీ వారిని అభినందించారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా 150 మందికి ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున పెన్షన్ దాతల సహాయ సహకారములతో ఇవ్వడం అనేది మరుపురాని దని తెలిపారు. క్యాంపు చైర్మన్ డివి. వెంకటేశుల( చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలతో పాటు పెన్షన్ లాంటి కార్యక్రమాన్ని కూడా దాతల సహాయ సహకారంతో నిర్వహించడం మాకెంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాలుగా 25 మంది దాతలు ఈ శిబిరానికి తమ చేయూతనిచ్చి విరాళాలు ఇవ్వడం తాము వారి రుణమును తీర్చికోలేనిదని తెలిపారు. కేవలం పేదలకు వైద్యం ఎంతో ముఖ్యమైనదని, అటువంటిది శాంత కళా చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో, దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీన అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 25 మందికి 2000 రూపాయలు చొప్పున చదువులో ప్రతిభ కనపరిచిన వారందరికీ ప్రోత్సాహక నగదు బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. డాక్టర్ వినయ్ కుమార్ తోపాటు ఆలయ కమిటీ సభ్యులు రోగులకు ఒక నెలకు సరిపడు మందులను కూడా వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు కుల గురువు శ్రీ దివ్య జ్ఞ్యానానంద గిరి స్వామిని, ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డిని, 25 మంది దాతలను, శిబిరంలో సహాయ సహకారాలందించిన 11 మందిని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 275 మందికి వైద్యుల చేత వైద్య చికిత్సలతో పాటు దాతల చేతులు మీదుగా ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు గడ్డం పార్థసారథి, ఆలయ కమిటీ సిరివెళ్ల రాధాకృష్ణ, బండి నాగరాజు, బండి ఆంజనేయులు, మేకల శివయ్య, కాచర్ల నారాయణస్వామి, వేల్పుల వెంకటేష్, పెద్దకోట్ల విజయ్ ,పెద్దకోట్ల భాస్కర్, చందా జయ చంద్ర, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img