Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పరమ పవిత్రమైనది గుడ్ ఫ్రైడే.. పాస్టర్ మల్లెల రమేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం:: పరమ పవిత్రమైనది గుడ్ ఫ్రైడే అని,ప్రభువైన యేసయ్య లోక కళ్యాణం కొరకు జన్మించాడని పాస్టర్ మల్లెల రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణములోని ఎర్రగుంటలో గల చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు పాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్లెల రమేష్ బాబు గుడ్ ఫ్రైడే యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ బైబిల్ లోని అతి ముఖ్యమైన సంఘటనల యొక్క వివరాలను తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రభువైన యేసయ్య లోక మనుష్యుల పాపమును చేదించుటకు, శాప విముక్తి కలిగించుటకు, లోకానికి శాంతి, శుభము జరిగించిన నాడు తాను శిలువై మరణము ద్వారా తెలపడం జరిగిందని వారు తెలిపారు. మానవ విముక్తికి, భక్తులకు రక్షణ, పాప ప్రపంచానికి శాంతి శుభం యొక్క సంకేతమే గుడ్ ఫ్రైడే ద్వారా యేసయ్య తెలిపినాడని తెలిపారు. ఏసుక్రీస్తును కల్వరి గిరి పై సిలువ చేసిన దినమే శుభశుక్రవారం అని, క్రీస్తు మరణ తాలూకు జ్ఞాపకాలను క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే దినమే గుడ్ ఫ్రైడే అని తెలిపారు. క్రీస్తు సిలువలో మరణించిన పిమ్మట దేవుడు మరణ వేదనలు తొలగించి, లేపుట ద్వారా ఆయన మృత్యుంజయుడై వర్గానికి వెళ్లిపోయాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img