Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో ఏపీ జట్టు అత్యుత్తమ ప్రతిభ

విశాలాంధ్ర-రాప్తాడు : గత నెల 21 నుండి 25 వరకు బీహార్ లోని పాట్నాలో జరిగిన 25 రాష్ట్రాలు పాల్గొన్న జాతీయ జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో ఏపీ పురుషుల జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించిందని సాఫ్టుబాల్ అసోసియేషన్ ఏపీ సీ.ఈ.ఓ సి.వెంకటేశులు గురువారం తెలిపారు. గత మూడేళ్ళుగా ఈ జాతీయ జూనియర్ పోటీలలో రెండుసార్లు ప్రథమ స్థానం సాధించిందని ఈ ఏడాది తృతీయ స్థానం సాధించి సాఫ్ట్బాల్ క్రీడలో ఏపీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. సాఫ్ట్బాల్ క్రీడలో విశేషంగా రాణిస్తున్న ఉత్తరాది రాష్ట్రాలకు దీటుగా ఏపీ వారి సరసన నిలబడి విజయాలు సాధిస్తోందని ఇది ఏపీకే గర్వకారణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, శాప్, జాతీయ సాఫ్ట్బాల్ అసోసియేషన్ తోపాటు ఆర్.డి. టి సహకారంతో ఈ విజయాలు సాధిస్తున్నామన్నారు. జాతీయ సాఫ్ట్బాల్ సీఈవో ప్రవీణ్ అనౌకర్, అధ్యక్షుడు ఎల్ ఆర్ మౌర్య, ట్రెజరర్ శ్రీకాంత్ తోరాట్ చేతుల మీదుగా ఏపీ పురుషుల జట్టుకు కప్ తో పాటు మెడల్ ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసోసియేషన్ కార్యదర్శి నాగేంద్ర,ఏపీ పురుషుల జట్టు కోచ్ లు మహేష్, సింహాద్రి, బద్రి, సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img