Monday, May 6, 2024
Monday, May 6, 2024

పది ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా కుసుమాలు

విశాలాంధ్ర,కదిరి. నేడు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ సాధించినట్లు బిసి సంక్షేమ హాస్టల్ వార్డెన్ జయరామిరెడ్డి తెలిపారు. తిమ్మమ్మ మర్రిమాను హాస్టల్ ల్లో 14 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా వీరిలో లిఖిత్ రాయల్ 600 మార్కులకు (576)సాధించగా 6 మంది 500 పైన మార్కులు సాధించగా, వీవర్స్ కాలనీ బీసీ హాస్టల్ ల్లో తరుణ్ కుమార్ రెడ్డి 600 మార్కులకు గాను(559)సాధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తమ హాస్టల్ విద్యార్థులు మంచి మార్కులు సాధించడం సంతోషదాయకమన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు మించి ఇక్కడ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఇందుకు నిదర్శనం నేడు వెలువడిన ఫలితాలే అన్నారు. విద్యార్థులు పై చదువుల్లో ఇంకా మంచి ర్యాంక్ లు సాధించి, చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img