మండల తెలుగు యువత అధ్యక్షుడుకావాడి ప్రవీణ్ కుమార్
విశాలాంధ్ర తనకల్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినేలా, సమాజానికి అబద్ధాలను చూపాలనుకుంటున్న వ్యూహం సినిమాను అడ్డుకుంటామని తనకల్లు మండల తెలుగు యువత అధ్యక్షుడు పత్రికా ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులను కించపరిచే విధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ కించపరిచే విధంగా సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడని వీటిని ఆపకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని,వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అసభ్యంగా ట్విట్టర్లో షేర్ చేయడం రామ్ గోపాల్ వర్మ తగదని ఒకరి మనోభావాలను కించపరిచే విధంగా చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.రాష్ట్రంలో జరుగుతున్న నిజాలను నిర్భయంగా సినిమా గారూపొందిస్తే రాంగోపాల్ వర్మ తో పాటు ఏ సినిమా దర్శకుడునైనా ఆహ్వానిస్తామన్నారు.