Monday, April 22, 2024
Monday, April 22, 2024

బడుగులను బలితీసుకోవడమేనా సామాజిక న్యాయం ?

*యువతను చిదిమేస్తున్న డ్రగ్ మాఫియా
*ఇచ్ఛాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం.అశోక్

విశాలాంధ్ర-కవిటి:జగన్ రెడ్డి పాలనలో బడుగు,బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేదన్న విషయం చేనేత కుటుంబం బలవన్మరణంతో మరోసారి. రుజువైందని ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం.అశోక్ అన్నారు.మండలంలోని రామయ్యపుట్టుగ ఎమ్మెల్యే అశోక్ క్యాంపు కార్యాలయం లో విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు జగన్ రెడ్డిదే బాధ్యత అని వైకాపా నేతల భూ కబ్జాలకు నిండు కుటుంబం బలైందని అన్నారు.రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బా రావు,బార్య పద్మావతి,చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్లపడటం బాధాకరమని అన్నారు. నీపాలనలో సొంత జిల్లాలోనే పేదల భూములకు రక్షణ లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చునని విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో బడుగు,బలహీన వర్గాలు జగన్ రెడ్డికి బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.అలాగే టీడీపి హయాంలో పెట్టుబడుల ఆకర్షలో నెం.1లో ఉన్న ఏపీని జగన్ రెడ్డి వచ్చి గంజాయి,డ్రగ్ రవాణాలో నెం.1 స్థానానికి చేర్చాడని అన్నారు.విశాఖను స్టేట్ క్యాపిటల్గా మారుస్తామని చెప్పి డ్రగ్ క్యాపిటల్గా మార్చిన ఘనత జగన్ రెడ్డిదేనని విమర్శించారు.కంటెయినర్లో మార్పిన్,కొకైన్,హెరాయిన్, యాంఫటేమిన్,మెస్కిలన్ వంటి భయంకర మత్తు రవాణా చేస్తున్న వీరభద్రరావు సోదరుడు కూనం.పూర్ణచంద్ర రావు వైసీపీ సీనియర్ నేత, ఇతనికి విజయసాయి రెడ్డితో సంబందాలున్నాయని అన్నారు.విశాఖకు మకాం మారుస్తున్నాని జగన్ రెడ్డి చెప్పడం డ్రగ్,భూకబ్జాల కోసమేనని,యువతను డ్రగ్ మత్తులో ముంచి రాష్ట్రానిన లూటీ చేసేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు బెందాళం.రమేష్,సురాడ చంద్రమోహన్,తెదేపా సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img