Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జూలై 1 నుండి జగనన్న సురక్ష శిబిరాలు

విశాలాంధ్ర – పార్వతీపురం : జగనన్న సురక్ష శిబిరాలు జూలై ఒకటి నుండి మండల స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. జగనన్నకుచెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మండల స్థాయిలో శిబిరాలు నిర్వహించాలని, ధృవపత్రాలుజారీ ప్రధాన అంశంగా చేపట్టడం జరుగుతోందన్నారు. శిబిరాల్లో ప్రజలనుండి అర్జీలు స్వీకరించుటకు జగనన్నకు చెబుదాం కార్యక్రమం కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో శిబిరాల వివరాల షెడ్యూలు ముందుగా తెలియజేయాలని ఆమె సూచించారు. జూన్ 24 నుండి వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలియజేస్తారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంకు సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆమె చెప్పారు. కుల, ఆదాయ, జనన, మరణ, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు, వివాహ ధృవపత్రాలు, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన, కుటుంబ సభ్యుల విభజన, మ్యుటేషన్, ఫోన్ – ఆధార్ అనుసంధానం, పంట సేద్యం హక్కు కార్డులకు ఎక్కువ అర్జీలు వచ్చే అవకాశం ఉందని ఆమె సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి నిశితంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఆర్జీల పరిష్కారంపై ఆర్జీదారుకు విధిగా తెలియజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంపై ఇప్పటికే మండల స్థాయి శిక్షణ పూర్తి అయ్యిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం పక్కాగా ఏర్పాటు చేయుటకు అన్ని ఏర్పాట్లు చేశామని, బృందాలు నియమించామని అన్నారు. స్థానికంగా పరిష్కరించే సమస్యలు తక్షణం పరిష్కరించుటకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్రరావు, మునిసిపల్ కమీషనర్లు జె.రామఅప్పలనాయుడు, హెచ్. శంకరరావు, ఎస్. సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img