Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతిష్టాత్మకమ్ అయినా పట్టని వైనం

*నీరు కారిన నిర్వహణ,,!
*అధికారులను విమర్శించిన విద్యార్థులు, రైల్వే సిబ్బంది

విశాలాంధ్ర ఆముదాలవలస (శ్రీకాకుళం) : దేశ చరిత్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు దేశవ్యాప్తంగా ఏకకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ నిర్వహణ లో ఏర్పాట్లు చేసేందుకు కొంతమంది అధి కారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి కార్య క్రమ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిం చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నౌప డ, శ్రీకాకుళం రోడ్డు, దూసి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, డీసీఎం, ఎస్ ఎం లు పర్యవేక్షించారు. ఇందుకుగాను ప్రభు త్వం నుంచి ఒకచోట కార్యక్రమాన్ని నిర్వ హించేందుకు సంబంధిత అధికారులు ఖాతా ల్లో సుమారు ఎనిమిది లక్షలు జమ చేసినట్లు తెలిసింది. అంటే మూడు కేంద్రాలలో 24 లక్షల రూపాయలను ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ కార్యక్రమ ఏర్పాట్లకు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి రైల్వే ఉన్నతాధికారులు డిఆర్ ఎం, ఏడిఆర్ఎం, డీసీఎం, స్టేషన్ మాస్టర్ ల తోపాటు ఆర్పీఎఫ్ అధికారులు, జిఆర్పిఎఫ్ అధికారులు, ముఖ్యంగా రాజకీయ ప్రముఖు లు ఈ కార్యక్రమాల నిర్వహణకు హాజరై వారి ఉపన్యాసాలను అందించారు. అటు వంటి కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాల్సిన అధి కారులు కాసుల కక్కుర్తిలో వాటిని మంట కలిపారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉండే పాఠశాలల నుంచి విద్యా ర్థులను కార్యక్రమాలకు రప్పించారు. కనీసం వారికి మంచి భోజనం కూడా అందించలేదని విమర్శలు ఉన్నాయి. వివిధ పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పెన్ను సర్టి ఫికేట్ అందించి చేతులు దులుపుకున్నారు. సుమారు 41 వేల కోట్ల రూపాయలతో అభి వృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగితే ఆయా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఒక్కో కేంద్రానికి ఎనిమిది లక్షలు ప్రభుత్వం అందిస్తే తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహించటంపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బోర్డు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వారికి కూడా అమర్యాద జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. చీపురు పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో స్థాని కంగా పిడబ్ల్యుడి అధికారి వంట వార్పు కార్య క్రమాన్ని నిర్వహించి పాల్గొన్న అందరినీ సం తృప్తి పరిచారని తెలుస్తోంది. ఆముదాలవ లస, దూసి, నౌపడ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో రైల్వే అధికారులు సక్రమంగా నిర్వహించలేదన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొనే కార్యక్రమంలో కనీస మర్యాదలు లేకుండా వ్యవహరించటం పలు విమర్శలకు దారిస్తుంది. కొంతమంది బిజెపి నాయకులు నిర్వాహకులపై విరుచుకుపడ్డారు. ఇదేం తీరు అంటూ నిలదీశారు. పాఠశాల నుంచి వచ్చే విద్యార్థులకు సకాలంలో భోజనాలు అందించక మోడీ ప్రసంగం జరిగేంతవరకు వారిని అక్కడే ఉంచి కనీసం వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వకుండా నిర్బంధించడంపై విమ ర్శలు వస్తున్నాయి. జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం వచ్చిందని మా పిల్లలను విడిచి పెట్టాలంటూ ఉపాధ్యాయులు మొర పెట్టుకున్నప్పటికీ రైల్వే అధికారులు నిరంకు శంగా వ్యవహరించారని పాఠశాల నిర్వా హకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇచ్చిన పలవు ప్యాకెట్ కనీస ప్రమాణాలు పాటించకుండా వండించారని విద్యార్థులు పొట్లను అక్కడే పడేసి ఆకలి కడుపుతో వెనుతిరిగారు. రైల్వే సిబ్బంది ఆ పొట్లాలను అధికారుల ముందు వేసి కనీసం కుక్కలు కూడా తినడం లేదని యూనియన్ నాయ కులు అధికారులను నిలదీశారు. నిర్వహణ వ్యయం లక్షల్లో ఉన్నప్పటికీ కనీస సౌకర్యా లు కల్పనలో అధికారులు విఫలమయ్యారని చెప్పాలి. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం దారి మళ్ళించాలన్న విమర్శలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణ నీరుగారిన విషయమై పిడబ్ల్యుడి అసిస్టెంట్ ఇంజనీర్ మూర్తిని వివరణ అడగగా రైల్వేలో అనేక విభాగాలు ఉన్నాయని తాను కేవలం దయస్ మాత్రమే వేయించానని, డీసీఎం ఎస్ఎం లు మరి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారని వివ రించారు. భోజనం బాగోలేదన్న అంశం తమ వద్దకు వచ్చిందని దీన్ని కమర్షియల్ విభాగం వారు నిర్వహించారని ఆయన వివరించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించి నిర్వాహకులపై చర్యలు తీసు కోవలసిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img