Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇళ్ల స్థలాల ప్రతిపాదనలు తక్షణమే పంపాలి

ఆర్డీఓలకు జెసి నవీన్ ఆదేశం

విశాలాంధ్ర – శ్రీకాకుళం: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రతిపాదనలు తక్షణమే పంపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఆర్డీఓలను ఆదేశించారు. జర్నలిస్టుల హౌసింగ్ పథకంనకు సంబంధించి రెండవ సారి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, పలాస ఆర్డీఓ డాక్టర్ భరత్ నాయక్, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్. రంగయ్య లు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ వారీగ సమీక్షిస్తూ పలాస డివిజన్ లో సైట్ లు గుర్తించినదీ లేనిది అడుగగా ఇప్పటికే సైటు గుర్తించడమైనదని, దరఖాస్తులు పరిశీలించినట్లు ఆర్డీఓ భరత్ నాయక్ చెప్పగా తక్షణమే సంబంధిత ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ టెక్కలిలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని చెప్పారు. టెక్కలికి అందుబాటులో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి చూడాలని సబ్ కలెక్టర్ కు జెసి వివరించారు. చర్యలు త్వరితగతిన ప్రారంభించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. శ్రీకాకుళం డివిజన్ లో ఆమదాలవలస, తిమ్మాపురం, బూర్జ, సరుబుజ్జిలి, లావేరు మండలాల్లో ఇప్పటికే సైట్ చూడడమైనదని శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య జెసికి వివరించారు. తక్షణమే పరిశీలించి జాబితా సిద్దం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ మొదటిసారి నిర్వహించిన సమావేశం నాటికి 326 ధరఖాస్తులు రాగా రెండవ సారి నిర్వహించిన సమావేశం నాటికి మరో 23 దరఖాస్తులు ఆన్ లైన్ లో వచ్చినట్లు వివరించారు. సభ్యులు శాసపు జోగినాయుడు, వి. సన్యాసినాయుడు మాట్లాడుతూ గతంలో ఒక సెంటు ఇళ్ల పట్టాలను సుమారు 60 మంది వరకు ఉంటారని వారికి మినహాయింపు లేదా ఆ పట్టాలు తిరిగి ఇచ్చేస్తారని జెసికి వివరించారు. తిరిగి 2వ తేదీన సమావేశం ఏర్పాటు చేయాలని డిఐపిఆర్ఓ చెన్నకేశవరావుని ఆదేశించారు. ఈ సమావేశంలో సభ్యులు శాసపు జోగినాయుడు, వి. సన్యాసినాయుడు, డిఐపిఆర్ఓ కె. చెన్నకేశవరావు, డిపిఆర్ఓ కె. బాలమాన్ సింగ్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img