London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

బానిసత్వాన్ని భరించం

. అమరుల ఆశయాలు, ప్రజాకాంక్ష నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం
. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా?
. దశాబ్ది ఉత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : బిడ్డ ఇంట్లో జరిగే శుభాకార్యానికి వచ్చేందుకు తల్లికి ఏ హోదా కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అలాగే తల్లిని ఇంటికి ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్‌ అవసరమా? అని ప్రశ్నించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. తెలంగాణప్రదాత, మాతృ సమానురాలైన సోనియాగాంధీని ఈ పండుగకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించామని అలాంటి సమయంలో ఏ హోదాలో సోనియాగాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారని, మరి ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం… అని నిలదీశారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుందని, ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతమన్నారు. నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇదని, తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళి అర్పించారు. బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మనతత్వం అని పేర్కొన్నారు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదని, డిసెంబరు 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ప్రగతిభవన్‌ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నామన్నారు. జూన్‌ 2, 2014న తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరిందని, అంతటితో మనం లక్ష్యాన్ని చేరినట్టు కాదని, ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుందన్నారు. సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం ఇప్పుడు తెలంగాణ భవిష్యత్‌ నిర్మాణానికి కీలకాంశాలుగా మారాయన్నారు.
తెలంగాణ చరిత్రపుటల్లో ముగ్గురు మహిళలు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే మొట్టమొదటి త్యాగం, సాహసం సోనియా గాంధీదని, నాడు యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారన్నారు. జగ్జీవన్‌రామ్‌ కుమార్తె మీరా కుమారి అప్పటి లోక్‌ సభ స్పీకర్‌, ఒక మహిళగా కన్న తల్లిగా ఆరోజు ఆమె సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడంలో అత్యంత కీలకమైన బాధ్యతను పోషించారన్నారు. ఈ ముగ్గురు మహిళా నేతలు చేసిన త్యాగాలు, అందించిన సహకారం తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. తెలంగాణ చరిత్ర పుటల్లో వీరి నిర్ణయాలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.
గ్రీన్‌ తెలంగాణకు 2050 మాస్టర్‌ ప్లాన్‌
తెలంగాణకు ‘‘గ్రీన్‌ తెలంగాణ-2050 మాస్టర్‌ ప్లాన్‌’’ తయారు చేస్తున్నామని, అందులో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య ప్రాంతం సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించామన్నారు. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపా యాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తామని వివరించారు. మూసీ సుందరీకరణ ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు వెల్లడిరచారు. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ అన్న మాట వినిపించడానికి వీలు లేదని సంకల్పం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.
ప్రజల వద్దకే పాలన…
ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా అభయ హస్తం గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా పథకాల కోసం కోటీ 28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.కోటి తొమ్మిది వేల దరఖాస్తులు మిగిలాయని, ఈ దరఖాస్తులు కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంద న్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆడబిడ్డ లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామ న్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్‌ పేటెంట్‌ స్కీం అని ఈ పథకం ద్వారా తొలి సారి పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఈ పథకాన్ని మరింత సమర్ధంగా అమలు చేయడానికి ఐదు లక్షలు ఉన్న పరిధిని పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు కట్టుబడి ఉన్నామ న్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని తెలిపారు. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడి యంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇస్తూనే వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచామన్నారు. లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కలలు నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాని త్వరలో పేదల కోసం ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నారన్నారు. ఇందు కోసం రూ.22,500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయబోతు న్నట్లు వెల్లడిరచారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై అధికారుల బృందం ఇప్పటికే దిల్లీ, ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు. 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయ్‌లెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్‌ సదుపాయం కల్పిస్తున్నామని, దీని కోసం రూ.1,135 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చామని, ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచామని, ఎలాంటి షరతులు లేకుండా తడిచిన ధాన్యం కొంటున్నామ న్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నట్లు వివరించారు. ధరణి పై స్పెషల్‌ డ్రైవ్‌ తో సమస్యలు పరిష్కరిస్తున్నామని, రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంద న్నారు. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మీ పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా సంకల్పమని వివరించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని అన్నారు. విద్యార్థుల యూనిఫాం కుట్టే ఆర్డర్‌ మహిళా సంఘాలకే అప్పగించామని, గ్యాస్‌ బండ ను కేవలం 500 రూపాయలకే ఇచ్చే పథకాన్ని ప్రారంభించామన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని, కేంద్రం పై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుని, సాగునీటి ప్రణాళికలు సమర్ధవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వ ఆలోచన అన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లిందనిదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img