రాష్ట్రంలో మూడు రోజులు తేలిక పాటి మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ఉత్తర, తూర్పు, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఉదయం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబాబూబ్నగర్, కొత్తగూడెంతో పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.