Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

భారీ వర్షంతో భాగ్యనగరం జలమయం

విశాలాంధ్ర `హైదరాబాద్‌:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే మూడు రెట్లు అధికంగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. హైదరాబాద్‌ నగరంలో గురువారం కుండపోతగా వర్షం కురిసింది. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కమలానగర్‌ తదితర ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. సరూర్‌నగర్‌ చెరువులోకి భారీగా వరద చేరడంతో చైతన్యపురి పరిధిలోని కాలనీలు ముంపునకు గురయ్యాయి. వీధుల్లోకి వరదనీరు పోటెత్తింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని పీ అండ్‌ టీ కాలనీ, కోదండరామ్‌ నగర్‌ వీవీ కాలనీల్లో వీధులు నదులను తలపించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపోలోకి భారీగా వరదనీరు చేరింది. ఎల్బీనగర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అత్యధికంగా నాగోల్‌ బండ్లగూడలో 21.2 సె.మీ, ప్రశాంత్‌నగర్‌లో 19.2 సె.మీ, హస్తినాపురంలో 19 సె.మీ, సరూర్‌నగర్‌లో 17.9సె.మీ, హయత్‌నగర్‌లో 17.1 సె.మీ వర్షపాతం నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img