Friday, June 14, 2024
Friday, June 14, 2024

హైదరాబాద్‌కు మరో వందే భారత్‌ ఎక్స్ ప్రెస్

ఈ నెల 6న లేదా 15న ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం

హైదరాబాద్ కు మరో వందే భారత్ వచ్చేసింది. తాజాగా వచ్చిన వందే భారత్ రైలును హైదరాబాద్ – బెంగళూరు మధ్య నడిపించనున్నట్లు సమాచారం. ఈ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఈ నెల 6న లేదా 15న వర్చువల్ గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాచిగూడ- యశ్వంత్ పూర్ స్టేషన్ల మధ్య పరుగులు తీయనున్న ఈ సెమీ బుల్లెట్ రైలు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణానికి ప్రస్తుతం సుమారు 11 గంటలు పడుతోంది. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలకు తగ్గనుంది. ఈ రైలు కాచిగూడలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి మధ్యహ్నం 3 గంటలకు యశ్వంత్ పూర్ స్టేషన్ లో బయలుదేరి రాత్రి 11:30 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img