Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేసీఆర్‌కు చట్ట సభల మీద విశ్వాసం సన్నగిలిందనడానికి..జరిగిన సమావేశాలే నిదర్శనం : ఈట‌ల

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెషన్ అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించారని అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని సెటైర్ వేశారు. శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం గది కూడా ఇవ్వకుండా వివక్ష చూపించారని..దాంతో, తాము గన్ మెన్ గదిలో కూర్చొని నోట్స్ రాసుకున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చట్ట సభల మీద విశ్వాసం సన్నగిలిందనడానికి నిదర్శనం ఇటీవల జరిగిన సమావేశాలే నిదర్శనం అని విమర్శించారు.

  • ఉమ్మడి రాష్ట్రంలో 13 పార్టీలు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, ఇప్పుడు అసెంబ్లీలో ఉంది కేవలం నాలుగు పార్టీలే అన్నారు. అందులో బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పటికీ దాన్ని బీఏసీకి పిలవకపోవడం అంటే సీఎంకు ఎంత అక్కసు ఉందో తెలుసుకోవచ్చన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 50 నుంచి 65 రోజులు సమావేశాలు జరిగేవని, ఇప్పుడు ఒక సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనని అన్నారు. స్పీకర్‌‌ను మా హక్కులను కాపాడండి అని ఆడిగాం. అసెంబ్లీలో మేము ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆయన కనీసం మా మొహం కూడా చూడరు. అసెంబ్లీలో కేవలం సీఎం వైపు మాత్రమే చూస్తూ మాకు సమయం కూడా ఇవ్వరు అని ఈటల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img