Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు..!

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణ శాఖ సూచించినట్టుగానే.. హైదరాబాద్‌‌తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కుమ్మరించింది. మధ్యాహ్నం రెండింటి వరకు ఎండ కొట్టగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. క్యుములో నింబస్ మేఘాలు కమ్ముకుని.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా భారీ ఎత్తున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ స్థాయిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో.. నగరం మొత్తం తడిసిముద్దయింది. రోడ్లన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. పలు చోట్లలో రోడ్లపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలవటంతో.. భారీగా ట్రాఫిక్ జామైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జగద్గిగిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర ఏరియాల్లోనూ భారీ వర్షం పడుతుంది. కుత్బుల్లార్, మల్కాజిగిరి, ఆల్వాల్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతుంది. పలు ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో.. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఇప్పటికే వర్షం తీవ్రతతో రోడ్లపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయని.. అవసరమైతే తప్ప బయటి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాత్రి సమయంలోనూ భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో రోడ్లపై తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని.. హెచ్చరించింది. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో వాహనాలు నిదానంగా వెళ్లాలని.. సూచించారు.
భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్

కుత్బుల్లాపూర్‌, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారాం, సూరారం, బాచుపల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో ఈదుర గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్‌లో గాంధీ ఆసుపత్రి, రైల్వే స్టేషన్, మెట్టుగూడ, సీతాఫల్ మండి, చిలకలగూడా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బషీర్ బాగ్, కోటి అబిడ్స్, బేగం బజార్ ప్రాంతాల్లోనూ గట్టిగానే వర్షం కురిసింది. సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్ జూబలీహిల్స్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, అబిడ్స్, గోశామహల్, అఫ్జల్ గంజ్‌లో కూడా భారీగా వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img