Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ఇండియా కూటమిని గెలిపించండి: సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి.. అంటూ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో సందేశం విడుదల చేశారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు.. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు.. అని.. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలంటూ.. రేవంత్ రెడ్డి కోరారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎదిగారంటూ పేర్కొన్నారు. రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందని.. ప్రజలు గమనించి ఓటు వేయాలని కోరారు.ఇదిలాఉంటే.. పటాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు సంధించారు. రాజ్యాంగం మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. మన హక్కులను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. మెదక్‌కు కాంగ్రెస్ ఎన్నో కేంద్రసంస్థలను తీసుకొచ్చిందని.. పటాన్‌చెరు ఒక మినీ ఇండియా అంటూ పేర్కొన్నారు.దేశానికి ఉత్పత్తులు అందించే పారిశ్రామికవాడ పటాన్‌చెరు అని.. బీఆర్ఎస్ అభ్యర్థి.. భూములు ఆక్రమించుకున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఉండగా.. వెంకట్రామిరెడ్డికి మరో పదవి ఎందుకు?పదేళ్లుగా మోదీ, బీజేపీ అధికారంలో ఉండి ఏం చేశారు? అంటూ ప్రశ్నించారు. మతం పేరుతో కొట్లాడుకోవాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు.. శాంతిభద్రతలు లేకుండా, గొడవలు జరుగుతుంటే పెట్టుబడులు వస్తాయా? పటాన్‌చెరుకు మరిన్ని పరిశ్రమలు వస్తేనే మన భూముల రేట్లు పెరుగుతాయన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టాలంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img