Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అవినీతి రహిత పాలన సాగాలి

విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
సీపీఐ శాసనసభ పక్షనేత కూనంనేని

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : అవినీతిరహిత పాలన అందిస్తేనే హీరోలవుతారని, లేకపోతే జీరోలుగా మిగిలిపోతారని తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలకు సీపీఐ శాసనసభపక్ష నేత కూనంనేని సాంబశివరావు హితవు పలికారు. రాష్ట్రంలో చాలా శాఖల్లో అవినీతి అధికారుల రాజ్యం నడుస్తోందనే, ఇటీవల ఘటనలే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ఉన్నతాధికారులు స్వయంగా అవినీతికి తెరలేపి వందల ఎకరాల భూములు మాయం చేశారనే ఆరోపణలు వచ్చాయని, వీటి విచారణకు కమిటీ వేయాల్సిన అవసరం ఉందని కూనంనేని సూచించారు. గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శుక్రవారం అసెంబ్లీలో కూనంనేని మాట్లాడుతూ నిరుపేదల కోసం 60 గజాల స్థలంలో తాము జెండా పాతితే గత ప్రభుత్వం కేసులు పెట్టిందని, కానీ వందల ఎకరాలు కబ్జా చేసిన అవినీతి అధికారికి ప్రభుత్వ పెద్దల అండదండలు అందాయని విమర్శించారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చోటివ్వరాదని, అపుడే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధిపై నూతన ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విధ్వంసమైన వ్యవస్థలను సరిచేయాలని సూచించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరం
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని కూనంనేని విమర్శించారు. ముఖ్యంగా అప్పులు, వడ్డీలు, పెండిరగ్‌ బిల్లులు, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ ఇలా అనేకం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చాలామంది సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, అందువల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నూతన ప్రభుత్వం ముందుగా విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తించి…ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గతంలో బడ్జెట్‌లో 11 శాతం నిధులు విద్యా వ్యవస్థకు కేటాయించే వారని, ఇప్పుడది 6 శాతానికి పడిపోయిందన్నా విమర్శించారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాలన్నారు. అవసరమైన ప్రతి చోట వైద్యులను నియమించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అసుపత్రులలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తోందన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం చిన్న ప్రాజెక్టులు పట్టించుకోలేదన్నారు. రైతులకు సరైన సమయంలో పంటల బీమా అందేలా చూడాలని సూచించారు. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామిక అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా చిన్నచిన్న నగరాలకు విస్తరింపచేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఖాళీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి చెందిన వరవరరావు, సాయిబాబా, హరగోపాల్‌ వంటి పెద్దలు కేసులతో ఇబ్బందులు పడుతున్నారని, తాజాగా కొంతమంది ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు జరిగాయని, ఇలాంటి వాటిపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img