Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కొత్త తరానికి అవకాశమివ్వాలనే…

. అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై జో బైడెన్‌
. కమలా హారిస్‌కు పెరుగుతున్న డెమొక్రాట్ల మద్దతు
. ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థించని ఒబామా
. అరిజోనా సెనేటర్‌కు ఛాన్స్‌పై ఊహాగానాలు

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయంతోనే అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నట్లు బైడెన్‌ వెల్లడిరచారు. తన ఈ నిర్ణయం దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు దోహదమవుతుందని అభిప్రాయపడ్డారు. ‘దీర్ఘకాలం పాటు ప్రజా జీవితాలు గడిపేందుకు ఒక సమయం ఉంటుంది. అదే విధంగా కొత్త వారికి… యువ గళాలకు అవకాశం లభించే సమయం కూడా ఉంటుంది. అదిప్పుడు ఆసన్నమైంది. వర్తమాన నిర్ణయాలు దేశ భవిష్యత్‌కు, భావితరాలకు ప్రయోజనం చేకూర్చగలవని ఆకాంక్షిస్తున్నా’ అని బైడెన్‌ అన్నారు. ఆయన ఓవల్‌ కార్యాలయం నుంచి జాతినుద్దేశించి వ్యాఖ్యానించారు.
కాగా, కమలా హారిస్‌ అభ్యర్థిత్వాన్ని దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతు ప్రకటించలేదని న్యూయార్క్‌ పోస్టు పేర్కొంది. ‘కమలా హారిస్‌ అభ్యర్థిత్వంతో ఒబామా నిరాశ చెందారు. ఆమె గెలవలేరని ఆయనకు తెలుసు. వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని చెప్పిన ఆమె ఎప్పుడు కూడా సరిహద్దులను సందర్శించలేదు. తన ముందున్న సవాళ్లకు ఎదురు నిలవలేరు’ అని సన్నిహిత వర్గాలు చెప్పినట్టు న్యూయార్క్‌ పోస్టు కథనం పేర్కొంది. ఆరిజోనా సెనేటర్‌ మార్క్‌ కెల్లేకు డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్ధిగా నిలబెట్టాలని ఒబామా కోరుకుంటున్నట్లు వెల్లడిరచింది. వచ్చే నెలలో జరిగే డెమొక్రాటిక్‌ పార్టీ జాతీయ సదస్సులో మార్క్‌ కెల్లేకు మద్దతు ఇవ్వాలని ఒబామా భావిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు కమలా హారిస్‌ అభ్యర్ధిత్వాన్ని ఒబామా ఆమోదిస్తారని ఎన్బీసీ న్యూస్‌ నివేదించింది.
19న డెమొక్రాటిక్‌ పార్టీ జాతీయ సమావేశం
డెమొక్రాట్‌ పార్టీ జాతీయ సమావేశం ఆగస్టు 19న చికాగాలో జరగబోతోంది. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా ఎన్నుకోనున్నారు. 263 మంది డెమొక్రాట్‌ పార్టీ చట్ట సభ్యులు, 23 మంది గవర్నర్లలో ఇప్పటికే 178 మంది కమలా హారిక్‌కు మద్దతు తెలిపారు. అధ్యక్ష పదవికి నామినేషన్‌ కోసం 4,800 మంది ప్రతినిధుల్లో నుంచి 1,976 మంది మద్దతు అవసరం కాగా బైడెన్‌కు గతంలో 3,896 మంది మద్దతు లభించింది. బైడెన్‌ మద్దతు ఉండటంతో చికాగో సదస్సులో కమలా హారిస్‌ అభ్యర్ధిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశముంది. డెమొక్రాట్లలో 65శాతం మంది కమలా హారిస్‌కు మద్దతు తెలుపుతున్నట్టు మార్నింగ్‌ కన్సల్ట్‌ సర్వే వెల్లడిరచింది. అధ్యక్షుడిగా ట్రంప్‌నకు 47 శాతం, కమలా హారిస్‌కు 45 శాతం మంది మద్దతు ఇస్తున్నట్టు వెల్లడైంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ను ఓడిరచే సత్తా కమలా హారిస్‌కు ఉన్నట్లు పార్టీలో చాలా మంది విశ్వసిస్తున్నారు.
కమలా హారిస్‌ దూకుడు…
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా తనకు బైడెన్‌ మద్దతు ప్రకటించిన వెంటనే కమలా హారిస్‌ విజృంభించారు. ట్రంప్‌పై ఎదురుదాడికి దిగారు. డేలావేర్‌లోని విల్మింగ్టన్‌లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన ఆమె గెలుపు మనదేనంటూ దీమా వ్యక్తంచేశారు. మహిళలను వేధించే వేటగాడు.. వినియోగదారులను కొల్లగొట్టే కేటుగాడు.. స్వలాభం కోసం నిబంధనలను అతిక్రమించే మోసగాడు… అంటూ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అనుకూలంగా సర్వేలు…
ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగినా ఊహించని రీతిలో కమలా హారిస్‌కు మద్దతు పెరుగుతోంది. ‘నేషనల్‌ ప్రెసిడెన్షియల్‌ పోల్‌’ ఫలితాలు కమలా హారిస్‌కు అనుకూలంగా వచ్చాయి. రాయిటర్స్‌ పోల్‌లోనూ కమలా హారిస్‌ గెలుపును అంచనా వేశారు. ట్రంప్‌పై రెండు శాతం ఆధిక్యతను ఆమె సాధించగలరని సర్వే నివేదిక పేర్కొంది. కమలా హారిస్‌కు 44 శాతం మంది, డొనాల్డ్‌ ట్రంప్‌కు 42 శాతం మంది మద్దతు ఉన్నట్లు సర్వేలు పేర్కొన్నాయి.
కమలా హారిస్‌ కోసం విరాళాల వెల్లువ
డెమొక్రాట్ల పార్టీలో కమలా హారిస్‌కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. పార్టీ అభ్యర్థి కోసం విరాళాలు సేకరించే యాక్ట్‌ బ్లూ సంస్థ… 46.7 మిలియన్‌ డాలర్లను కేవలం గంటలో సమీకరించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను బైడెన్‌ ప్రతిపాదించిన 5 గంటల్లో చిన్న మొత్తాల్లో వచ్చిన విరాళాలే 27.5 మిలియన్‌ డాలర్లని యాక్ట్‌ బ్లూ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img