Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

స్తంభించిన హైవే

. విజయవాడ`హైదరాబాద్‌ మధ్య రాకపోకల బంద్‌
. కిలోమీటర్ల పొడవునా నిలిచిన వాహనాలు
. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద
. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: తెలుగు రాష్ట్రాల పరిధిలో నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా మునేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిని మునేరు వరద ముంచెత్తింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే విజయవాడహైదరాబాద్‌ మధ్య రాకపోకలు స్తంభించాయి. జాతీయ రహదారికి రెండు వైపులా కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మునేరుకు వరద గణనీయంగా పెరిగింది. ఎగువున ఉన్న చిన్నపాటి వాగులన్నీ పొంగిపొర్లుతుండటం, కట్టలేరు నుంచి కూడా వరద పోటెత్తడంతో మునేరుకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో మునేరు తీర ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. కీసర బ్రిడ్జి సమీపంలో ఐతవరం గ్రామం వద్ద హైవే లోతట్టు ప్రాంతంలో ఉండడంతో మునేరు వరద నీరు పొలాల నుండి పొంగిపొర్లుతూ జాతీయ రహదారిని ముంచెత్తింది. 2006లో ఇదేస్థాయిలో జాతీయ రహదారిపై వరద నీరు వచ్చింది. 17 సంవత్సరాల తర్వాత అంతటి స్థాయిలో వరద నీరు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులను మధిర మీదుగా దారి మళ్లించాలని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులను నందిగామ వద్దే నిలిపివేశారు. వరద తగ్గే వరకు బస్సులు నడపలేమని డ్రైవర్లు చేతులెత్తేశారు. కార్లు, లారీలను నందిగామ నుంచి మధిర మీదుగా దారి మళ్లించారు. విజయవాడ-హైదరాబాద్‌ రెండు వైపులా కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించేవారు ట్రాఫిక్‌లో ఇరుక్కొని ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక మధ్యలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి
ఎగువున కురిసిన వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువున మునేరులోకి 1.38 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
ఆ ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటున్నది. ఉదయం 11 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్‌ రెండు గేట్లు ఎత్తి 9 టీఏంసీల వరదను సముద్రంలోకి విడిచి పెట్టారు. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 14 అడుగులు దాటింది. పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయం వద్ద కేశఖండశాల దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరింది. లింగాల వంతెన నీట మునిగింది. మునేరు, కట్టలేరు, వైరా ఏరు వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
మరోవైపు గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ధవళేశ్వరం కాటన్‌ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద నీటి మట్టం 12.9 అడుగులకు చేరింది. డెల్టా కాల్వలకు 4 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సముద్రంలోకి 11 లక్షల 44 వేల క్యూసెక్కులు విడిచిపెట్టారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో తీరం ప్రమాదకరంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినవిల్లి మండలం వెదురుబీడెం వద్ద కాజ్‌వే ముంపుబారిన పడిరది. అద్దంకివారిలంక, వీరవల్లిపాలెం గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముంచింగి పుట్టు, బిరిగుడ, లక్ష్మీపురం గడ్డ మండలంలో గంజిగడ్డ పాడేరు, జి. మాడుగుల మండలాల్లో మత్స్యగడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు కొన్నిచోట్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిత్యం పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు వైద్యసేవలు అందించే సిబ్బంది ప్రమాదకరంగా గడ్డలు దాటుతున్నారు. డుంబ్రిగూడ మండలం కొల్లాపుట్‌ పంచాయతీ లోగిలిగెడ్డ రోడ్డు పైనుంచి వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img