Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీఎస్పీ విజయం ఆదివాసీలకు రక్షణ కవచం

బీఎస్పీ పాడేరు నియోజకవర్గం అభ్యర్థి అప్పారావు

విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా):- ఆదివాసీల హక్కులు, చట్టాలు కాపాడబడాలంటే బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన చింతపల్లి వాసి సుర్ల అప్పారావు అన్నారు. చింతపల్లి వారపు సంతలో బుధవారం ఆయన తన మేనిఫెస్టోను పార్టీ శ్రేణులతో కలిసి సంతలో ప్రతి ఒక్కరికి ఇచ్చి తనకు మద్దతు తెలపాలని ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు రక్షక కవచాలైనటువంటి 1/70, పేసా, అటవీ హక్కుల చట్టాలతో పాటు అనేక చట్టాలు ఉన్నాయన్నారు. వాటన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వాలు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. జీవో నెంబర్ 3 ని రద్దుచేసి గిరిజనులకు దక్కవలసిన శత శాతం ఉద్యోగాలకు చెక్ పెట్టారన్నారు. బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చి గిరిజనులను ఆందోళనకు గురి చేశారన్నారు. ఇటువంటి వాటిని పారద్రోలి మన హక్కులు మనం రక్షించుకోవాలి అంటే బీఎస్పీని ఆదరించాలని ఆ పార్టీ తరఫున పాడేరు నియోజకవర్గానికి పోటీలో నిలిచే నన్ను ఆశీర్వదించాలని అప్పారావు అభ్యర్థించారు. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఎస్టీ కమిషన్ సభ్యునిగా ఉన్న మత్స్యరాస విశ్వేశ్వర రాజు గాని, ఎంపీగా ఉన్న మాధవి గాని, ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మి గాని, ఎమ్మెల్సీగా ఉన్న కుంభ రవిబాబు గాని ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన ప్రశ్నించారు. గిరిజనుల పక్షపాతి అంటూ చెప్పుకునే వైకాపా ప్రభుత్వంలో ఉన్న వీరంతా దొంగలే అని అర్థం అవుతుందన్నారు. గిరిజనులుగా ఉంటూనే గిరిజన జాతికి వీరంతా చేసే నష్టాన్ని ఆదివాసీ ప్రజలు గమనించి రాబోవు సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీని ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img