Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

48 గంటల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాలి

సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం జిల్లాకు ముగ్గురు పరిశీలకులు నియామకం

జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర అనంతపురం : సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా పోలింగ్ రోజు, తర్వాత వచ్చిన ఫిర్యాదులను 48 గంటల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా ఫిర్యాదులు, కౌంటింగ్ ఏర్పాట్లు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికలలో వచ్చిన ఫిర్యాదులను రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకుని సరైన ఎండార్స్మెంట్ ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పోలింగ్ రోజు, తర్వాత చాలా ఫిర్యాదులు వచ్చాయని, వెంటనే వాటికి పరిష్కారం ఇవ్వాలన్నారు. ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు రావడం జరిగిందని, వాటి పరిష్కారానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒక టీం పెట్టాలన్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, పోలింగ్ స్టేషన్ల వారీగా ఫిర్యాదులను పరిష్కరించి వాటిని క్లోజ్ చేయాలన్నారు.
సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమీషన్ జిల్లాకు ముగ్గురు పరిశీలకులను నియామకం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పరిశీలకులుగా మనీష్ సింగ్ ఉరవకొండ, కళ్యాణదుర్గం, శింగనమల అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ఎన్నికల పరిశీలకులుగా సి.అజయ్ నాథ్ ఝ I.A.S, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అజయ్ కుమార్ ను కౌంటింగ్ అబ్జర్వర్లుగా నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన 8 మంది గూండాలు, మట్కా, జూదం ఆడే వారిని బహిష్కరించడం జరిగిందన్నారు. ఆయా నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టే వారిని గుర్తించి వారికోసం షాడో పార్టీ పెట్టాలన్నారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత, కౌంటింగ్ ప్రక్రియ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందని, లా అండ్ ఆర్డర్ సమస్య చాలా సున్నితమైనదన్నారు. ఇబ్బందులు పెట్టేవారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ముందుగానే గుర్తించాలన్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడా గొడవలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో బైండోవర్ చేసిన వారి జాబితా చూసుకుని ప్రస్తుత ఎన్నికల్లో జాబితాన్ని పోల్చి చూసి ఎవరైనా మిస్ అయి ఉంటే వారిని గుర్తించాలన్నారు. ఈ విషయమై సంబంధిత ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో పోలీసులు గట్టిగా కేసులు నమోదు చేయడం జరిగిందని, ఎన్నికల రోజు తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించరు అన్నది తప్పు చేసిన వారికి వారందరికీ తెలియాలన్నారు. సెక్షన్ 133(1)(సి ) కింద రాళ్లు, కర్రలు, రాడ్స్, ఇతర వస్తువులు చట్టపరమైన నిర్మాణ పనులకు మాత్రమే ఉపయోగించాలని, ఇది గనులు, భవన యజమానులకు వ్యక్తిగతమైన బాధ్యత అని, వాటిని ఇతరులు ఎవరూ వాడకుండా ఉండాలన్నారు. ఈ విషయమై మైడ్స్ డిడి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఇందులో నాణ్యత ఉండాలన్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, అధికారులంతా విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు. రిటర్నింగ్ అధికారులు రోజుకు రెండుసార్లు జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించి రిపోర్టులను అందించాలన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద 4 దిక్కులు కనిపించే విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, వెన్నెల శ్రీను, రాంభూపాల్ రెడ్డి, జి.వెంకటేష్, పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్ఓ రమేష్ రెడ్డి, ఈఆర్ఓ శిరీష, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, నోడల్ అధికారులు ఉమామహేశ్వరమ్మ, వీర్రాజు, భాస్కర్, నాగయ్య, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img