Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓటర్లకు మద్యం నగదు బహుమతుల పంపిణీ అరికట్టాలి

జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

విశాలాంధ్ర – బాపట్ల : ఓటర్లను ప్రలోభ పెట్టే మద్యం, నగదు వంటి బహుమతుల పంపిణీని అరికట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ విధానంపై ఎన్నికల నోడల్ అధికారులతో శుక్రవారం ఆయన తన చాంబర్లో సమావేశం నిర్వహించారు.నగదు, మద్యం, మాదకద్రవ్యాలను అరికట్టడానికి నోడల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దులు, చెక్ పోస్ట్ ల వద్ద ముమ్మర తనిఖీలు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీముల తనిఖీలు మరింత పెరగాలన్నారు. ముందస్తు అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, లేదా అభ్యర్థులు ఇంటింటా ప్రచారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం విక్రయాలలో 30% పెరిగితే సంబంధిత దుకాణాలు గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుండి అలాంటివి మూడు దుకాణాలు గుర్తించామన్నారు. వాటిపై విచారణ చేయాలన్నారు. నిబంధనల మేరకు విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై నిఘా ఉంచాలన్నారు. గడచిన ఆరు రోజుల్లో తొమ్మిది వేల లీటర్ల అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వాటి విలువ రూ.22.40 లక్షలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మరోవైపు 450 కేజీల గంజాయి పట్టుకున్నామని కలెక్టర్ కు వివరించారు. ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ కమిటీ విధానం అనుబంధంగా పనిచేస్తున్న అధికారులంతా మరింత చురుగ్గా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా తెలిపారు. అటవీశాఖ చెక్ పోస్టులు జిల్లాలో రెండు ఉండగా, వాటి వద్ద సంబంధితశాఖ అధికారుల పరిశీలన మరింత పెరగాలన్నారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. జిల్లాలోని 9 చెక్ పోస్టుల వద్ద నియమించిన ప్రత్యేక బృందాలు తనిఖీలు చేయాలన్నారు. అనుబంధశాఖల నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే సీజర్ మేనేజ్మెంట్ విధానం అమలులో సత్ఫలితాలు ఉంటాయన్నారు. రాజకీయ పార్టీల ప్రచారాలు, సమావేశాలు, సభలు, ర్యాలీలపై వీడియో చిత్రీకరణ పక్కాగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారాలలో మద్యం, నగదు పూర్తి స్థాయిలో అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఇప్పటికే జిల్లా సరిహద్దులు, చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. పోలీస్ బలగాల పనితీరు, ఇప్పటికే సీజ్ చేసిన అంశాలపై కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. ఆయా కమిటీల పని తీరును వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, సీజర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి సైదానాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, 17 శాఖల నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img